Sunday, January 26, 2025

ఉన్న కంపెనీలు పోకుండా చూడండి

- Advertisement -
- Advertisement -

ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్షంతో
8 ఐటి హబ్‌లను ఏర్పాటు చేశాం
కాంగ్రెస్ పాలనలో అవి
పట్టాలు తప్పుతున్నాయి : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్త కంపెనీల సంగతి దే వుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ వేదికగా సూచించారు.హైదరాబాద్ నగరం ఒక్కటే కాకుండా తెలం గాణలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రం గాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో సుమారు ఎనిమిది ఐటీ హ బ్‌లను బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. కానీ, కాంగ్రెస్ రాగానే మంచిగా నడుస్తున్న ఆ ఐటీ హబ్‌లు ఒక్కొక్కటిగా పట్టాలు తప్పుతున్నాయని, విద్యుత్, ఇంట ర్నెట్ బిల్లులు కూడా కట్టని  దుస్థితికి చేరుకున్నాయని అన్నారు. ఫలితంగా కంపెనీలు మూతపడుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం మీద కోపంతో ఇలాంటి దుశ్చర్యలు మానాలని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే సదుద్దేశంతో నెలకొల్పిన ఈ ఐటీ హబ్‌లను సక్రమంగా నడపాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News