Saturday, March 29, 2025

నిన్న గేట్లు…నేడు స్టార్టర్లు.. రేపు పుస్తెలతాళ్లా?

- Advertisement -
- Advertisement -

అప్పులపాలైన అన్నదాతలపై
ఎందుకు ఇంత కక్ష? ఎక్స్
వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసిన
బిఆర్‌ఎస్ అగ్రనేత కెటిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో అ ప్పులపాలైన అన్నదాతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకుంటోందని మా జీ మంత్రి, ఎమ్మెల్యే కె.టి.రామారావు ఆరోపించారు. రైతుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుతెన్నులపై శనివారం ఆయన ఎక్స్‌లో స్పం దించారు. నిన్న గేటు, నేడు స్టార్టర్లు, రేపు పెస్తెలతాళ్లా? రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎం దుకింత కోపం అంటూ ఎక్స్‌లో ప్రభుత్వాన్ని ఆ యన నిలదీశారు. తెలంగాణ ఆడబిడ్డలారా… ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారుతో జెర పై లం అంటూ హెచ్చరించారు. ప్రభుత్వానికి సా గు నీళ్లిచ్చే సోయి లేదు, పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు కానీ,

రైతన్నలు కష్టాల్లో ఉంటే వారిని వేధింపులకు గురిచేయడం ఏమాత్రం న్యాయం కాదన్నారు. తమప్రభుత్వం రద్దుచేసిన నీటితీరువాను ఐదేళ్ల తరువాత ఇప్పుడు వసూళ్లకు తెగబడతారా ? రైతులంటే కాంగ్రెస్‌కు అంత అలుసైపోయారా ? ఓట్లనాడు ప్రేమ ఒలకబోసి అధికారంలోకి వచ్చాక వారికి నరకం చూపిస్తారా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.2 లక్షల రుణమాఫీ సక్కగ చేయలేదని, రైతు భరోసాకు సవాలక్ష ఆంక్షలు పెట్టి రైతన్నను సంక్షోభంలోకి నెట్టింది మీరు కాదా అని కేటీఆర్ నిలదీశారు. వ్యవసాయరంగంలో సంతోషం ఆనవాళ్లు చెరిపేసి సమైక్యరాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లకు తెరదీస్తామని అంటే రాష్ట్ర రైతాంగం సహించదని, సంఘటితంగా పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News