Monday, January 20, 2025

భూములను తాకట్టు పెట్టాలని చూస్తోంది: ప్రభుత్వంపై కెటిఆర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కెటిఆర్ పైరయ్యారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్.. ఇప్పుడు, నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నదని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తుందన్నారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రు.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయ్నారు.

ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని విమర్శించారు. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉందని.. కొత్తగా పెట్టుబడులు రావడం లేదన్నారు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు?.. కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అని కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News