Monday, December 16, 2024

బిల్డర్లు, పెద్ద వ్యాపారులను బెదిరించేందుకే హైడ్రా తెచ్చారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా, మూసీ ప్రక్షాళనపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. బిల్డర్లు, పెద్ద వ్యాపారులను బెదిరించేందుకే హైడ్రాను తీసుకొచ్చారని కెటిఆర్ ఆరోపించారు.

మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని ఫైర్ అయ్యారు. మూసీ పేరుతో లూటీ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. నల్గొండకు నీళ్లు ఇవ్వడం బిఆర్ఎస్ కు ఇష్టం లేదా అని సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాచారం, ఉప్పల్ లో బిఆర్ఎస్ పాలనలో తామే మూసీ సివరేజ్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామని.. సివరేజ్ ప్లాంట్స్ పూర్తయితే మూసీ దిగువకు శుద్ధి చేసిన నీళ్లే వెళతాయని కెటిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News