Wednesday, November 20, 2024

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట..రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా?: కెటిఆర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం పెట్టడంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. “తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా? అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.

‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా? ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా? ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా? మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా?.. తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?.. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్ఛమైన స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా?. తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు’ అని ఎక్స్ లో కెటిఆర్ పోస్ట్ చేశారు.

కాగా, సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 3.45 గంటలకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌ఎలు, ప్రభుత్వ సలహాదారులు,గ్రేటర్ హైదరాబాద్ మేయర్, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News