Sunday, December 22, 2024

ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులతో బెదిరిస్తున్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ప్రజలు చేసిన తిరుగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం.. బిఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తుందని కేటీఆర్‌ ఆరోపించారు. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడాన్నికేటీఆర్‌ ఖండించారు. కార్యకర్తలతో మాట్లాడిన నేతలను అదుపులోకి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా తిరుగుబాటు అణచివేతకు అప్రజాస్వామిక చర్యలకు దిగారని ప్రభుత్వంపై నిప్పులు చేరిగారు.

ఈ మేరకు కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారు. అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తే మూర్ఖపు చర్యే అవుతుంది. రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై పోరాటం కొనసాగుతుంది. ఎంత అణచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం” అని కేటీఆర్‌ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News