Thursday, January 23, 2025

త్వరలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కెటిఆర్.. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నుంచి ఎప్పుడైనా తీర్పు రావొచ్చన్నారు. త్వరలోనే స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక వస్తుందని జోష్యం చెప్పారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ నుంచి తాటికొండ రాజయ్య గెలుపు ఖాయమని చెప్పారు.

రాష్ట్రంలో కెసిఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోతే వార్త.. రేవంత్‌ వచ్చాక కరెంట్‌ ఉంటే వార్త అని సెటైర్ వేశారు. రుణమాఫీ సభకు రావాలని రాహుల్‌ గాంధీని ఆహ్వానించారు.. కానీ, రుణమాఫీ కాలేదని తెలుసుకొని ఆయన రాలేదని కెటిఆర్ అన్నారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉందనేది ఎంత వాస్తవమో, జాబ్ క్యాలెండర్‌లో జాబ్స్ ఉంటాయనేది అంతే నిజమని సెటైర్లు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News