Monday, January 20, 2025

అవునా ..తొలి ప్రధాని నేతాజీనా.. కంగనాపై కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

సినీనటి ఇప్పుడు బిజెపి ఎంపిగా హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి పోటీ చేస్తున్న కంగనా రనౌత్‌కు దేశ తొలి ప్రధాని ఎవరనేది తెలియదా? అని బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ విమర్శించారు. ఇటీవల కంగనా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పారు. తొలి ప్రధాని నేతాజీ అని ఆమె చెప్పారు.

కాగా దక్షిణాదికి చెందిన బిజెపి నేత ఒకరు మహాత్మా గాంధీ మన దేశ ప్రధాని అన్నారని మరి వీరు ఎక్కడి నుంచి పట్టాలు పుచ్చుకున్నారనేది ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. ప్రధాని మోడీ మద్దతుదారుగా నిలిచిన కంగనా రనౌత్ తాను బిజెపిలో చేరడం తనకు గర్వకారణం అన్నారు. ప్రధాని మోడీ దేశానికి ప్రధాని అయిన తరువాతనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఓసారి కంగనా రనౌత్ ఓ ఇంటర్వూలో తెలిపారు.ఈ వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News