Thursday, December 26, 2024

కొండా సురేఖ దొంగ ఏడుపులు దేనికి: కెటిఆర్ హాట్ కామెంట్స్

- Advertisement -
- Advertisement -

మంత్రి కొండా సురేఖపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి మండిపడ్డారు. మా పార్టీ తరఫున ఆమెపై ఎవరు మాట్లాడలేదన్నారు. ఇదే సోషల్ మీడియాలో తమపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా?. కొండా సురేఖ గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా? అని ప్రశ్నించారు.

మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారంపై కెటిఆర్ ను మీడియా ప్రశ్నించగా.. ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. “గతంలో ఇదే కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు పంపిస్తా మీకు కావాలంటే.. హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా?. వాళ్లకు మనోభావాలు ఉండవా?. మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా?. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తా. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News