Friday, November 22, 2024

కాంగ్రెస్,బిజెపి క్విడ్‌ప్రోకో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఇడి దాడులు చేసి నెల రోజులు కావస్తోందని, ఈ దాడులపై ఇడి నుంచి గానీ, బిజెపి, కాంగ్రెస్ నుంచి గానీ ఒక్క మాట కూడా ఎందుకు లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. భారీగా డబ్బు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు చేయలేదని విమర్శించారు. దాడులు ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో అదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశమయ్యారని…ఇది బిజెపి, కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రోకో కాక మరేమిటని అన్నారు.

ఈ ప్రభుత్వానికి అక్రమ కేసులపై ఉన్న మోజు – ఆరోగ్య శాఖపై లేకపాయే అని పేర్కొన్నారు. అడ్డగోలు సంపాదనపై మోజు-పెద్దాసుపత్రుల ఆలన పాలనపై లేకపాయే.., కుటిల రాజకీయాలపై ఉన్న మోజు – రోగుల కష్టాలపై లేకపాయే అని విమర్శించారు. ముళ్ల కంచెలపై ఉన్న మోజు- ఆసుపత్రుల్లో మందుల కొరతపై లేకపాయే.. పోలీసు ఉద్యోగాలు ఊడపీకడంపై ఉన్న మోజు – ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతపై లేకపాయే అని మండిపడ్డారు. గుండె పట్టేస్తుంది ఆయాసంగా ఉందనివస్తే పక్కనున్న ప్రైవేట్ ఆసుపత్రికి పొమ్మన్నట్టే… పైసలే ప్రామాణికమైన పైసల పాలనలో అన్ని రంగాల్లో అవేదనలు, అవస్థలు, అన్యాయాలే అంటూ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News