Wednesday, January 22, 2025

మేడమ్.. వీటికి కూడా సమాధానం చెప్పండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశానికి అవసరమైనవి పాడైపోయిన డబుల్ ఇంజన్లు కావని, డబుల్ ఇంపాక్ట్ (రెండింతలు పనితీరు చూపే) ప్రభుత్వమని టిఆర్‌ఎస్ కార్యనిర్యాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను తప్పుపట్టారు. ఈ మేరకు ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు చేశారు. అందులో తాను పేర్కొన్న అంశాలను కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగాల్లో ప్రస్తావించాలని సూచించారు.
అప్పులు అంతగా ఎందుకు పెరిగాయి?
ఆర్థిక అంశాల్లో నిపుణురాలైన నిర్మలా సీతారామన్ తాను చెబుతున్న అంశాలను కూడా ప్రసంగాల్లో ప్రస్తావించాలన్నారు. 67 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో 2014 ముందు వరకు 14 మంది ప్రధానులు మారారని, అప్పటికి దేశ అప్పు రూ.56 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు.
అదే మోడీ ప్రధాని అయ్యాక గత ఎనిమిదేళ్లలో అప్పు రూ.100 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. దీనివల్ల దేశంలో ప్రతి ఒక్కరిపై అప్పు రూ.1.25 లక్షలకు చేరిందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు కాగా, జాతీయ తలసరి ఆదాయం కేవలం రూ.1.49 లక్షలేనని గుర్తు చేశారు. జిఎస్‌డిపిలో అప్పుల నిష్పత్తిని చూస్తే తెలంగాణ చాలా మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ జీఎస్‌డిపి, అప్పుల నిష్పత్తి 23.5 శాతమేనని, దేశంలోని 28 రాష్ట్రాల్లో 23వ స్థానంలో ఉందని వివరించారు. అదే దేశ అప్పులు, జీడీపీ నిష్పత్తి 59 శాతమని గుర్తు చేశారు. అంటే తెలంగాణ అప్పులే తక్కువని స్పష్టం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అంత మెరుగ్గా పనిచేస్తే భారతదేశం 4.6 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఎదిగి ఉండేదని పేర్కొన్నారు.

KTR Slams Nirmala Sitharaman over Telangana Debts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News