Sunday, December 22, 2024

ఇంతటి దుర్మార్గమైన ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే పదే విషం చిమ్ముతున్నారని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మంత్రి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. “తెలంగాణపై ప్రధాని మోడి చిన్న చూపు చూస్తున్నారు. తెలంగాణ అంటే చాలు.. బిజెపి నేతలు విషం చిమ్ముతున్నారు. తెలంగాణపై పగబట్టినట్లు ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. మోడీ పదే పదే తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా.. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటున్నారు. అమృతకాల సమావేశాల్లో ప్రధాని మోడీ విషం చిమ్మారు. సిఎం కెసిఆర్ 14ఏళ్లు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. రాష్ట్ర ఏర్పాటుతో తలంగాణలో ఉత్సవాలు జరగలేదని ప్రధాని మోడీ అబద్ధాలు చెప్పారు. బిజెపి జాతీయ పార్టీలా వ్యవహరించడంలేదు. కృష్ణా జలాల వాటా ఎందుకు తేల్చడం లేదు. సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటే తేలుస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి అనుమతులపై ఇబ్బంది పెడుతున్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదు. పాలమూరులో అడుగుపెట్టే అర్హత మోడీకి లేదు. ఇంతటి దుర్మార్గమైన ప్రధానిని ఎప్పుడూ చూడలే. విభజన హామీలకు కేంద్రం పాతరేసింది. తెలంగాణ ప్రజల ఉసురు బిజెపికి తగులుతుంది” అని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News