Monday, December 23, 2024

ప్రేమ పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ..? : ఎక్స్‌లో కెటిఆర్

- Advertisement -
- Advertisement -

అచ్చంపేటలో బుధవారం బిఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడిన ఘటనపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీరు చెప్పే ప్రేమను పెంచడం’ అంటే ఇదేనా రాహుల్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. ఆ పోస్టుకు కాంగ్రెస్ శ్రేణులు బిఆర్‌ఎస్ నేతలపై దాడి చేస్తున్న ఘటనకు సంబంధించి బిఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పోస్టు చేసిన వీడియోను కెటిఆర్ జతచేశారు. కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. ఈ దాడులు, దుర్భాషల్లో పోలీసులు కూడా భాగస్వాములు కావడం సిగ్గుచేటని మండిపడ్డారు. దాడికి పాల్పడిన గూండాలపై, ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే తాము మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామంటూ తెలంగాణ డిజిపిని టాగ్ చేశారు. తాము కచ్చితంగా న్యాయాన్ని పొందుతామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News