Wednesday, January 22, 2025

రేవంత్ తెలంగాణకు పట్టిన వ్యాధి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు, తెలంగాణకు పట్టిన వ్యాధి అని కెటిఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌ను ఎప్పుడు తిడుతూ ఉండడమే ఆయన నైజమని మండిపడ్డారు. రేవంత్ రూ.50 కోట్లకు పిసిసి పదవిని కొనుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని కెటిఆర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఒక్కరన్న రాజీనామా చేశారా? కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయని తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచితే సోనియా తెలంగాణ ఇచ్చిందని కెటిఆర్ పేర్కొన్నారు.

భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వారు అని, బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే అంత దరిద్రంగా ఉంటుందని కెటిఆర్ అన్నారు. నల్ల చట్టాలు తెచ్చిన బిజెపి కావాలా? జీవితాన్ని వెలుగులు నింపిన భారత రాష్ట్ర సమితి సర్కారు కావాలా ? తేల్చుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News