Wednesday, January 15, 2025

ఫార్ములా ఈ-రేసు కేసు.. సుప్రీం కోర్టుకు కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఫార్ములా ఈ-రేసు కేసుపై మాజీ మంత్రి కెటిఆర్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఎస్ఎల్ పి వేశారు కెటిఆర్.ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ.. కెటిఆర్ పై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా ఆయనపై కేసు నమోదు చేసింది. ఈక్రమంలో ఎసిబి కేసును కొట్టివేయాలంటూ.. కెటిఆర్ రాష్ట్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే, హైకోర్టు మాత్రం కేసు కొట్టివేసేందుకు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. రేపు కెటిఆర్ పిటిషన్ పై ధర్మాసనం విచారించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News