Tuesday, July 2, 2024

చిరకాలం మా గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు సాయిచంద్ : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

చిరకాలం తమ గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు సాయిచంద్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కెటిఆర్ సాయిచంద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. సాయిచంద్ మరణించి ఏడాది అవుతుందంటే ఎవరం నమ్మలేకపోతున్నామన్నారు. తన మాటతో, పాటతో అద్భుతమైన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించిన అద్భుత కళాకారుడు సాయిచంద్ అని కొనియాడారు. మన అందరి ఆప్తుడు.. చిరకాలం తమ గుండెల్లో నిలిచపోయే తమ్ముడు సాయిచంద్ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సాయి కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పారు. సాయి జ్ఞాపకార్థం పాటల సిడిలు, సంకలనాలు, పుస్తకాలు తీసుకొచ్చిన వారిని కెటిఆర్ అభినందించారు.

సాయిచంద్ ఆ పాట పాడితే కన్నీళ్లు వచ్చేవి : హరీశ్‌రావు భావోద్వేగం
సాయిచందర్ మరణాన్ని ఎవరూ ఊహించలేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. తనతో ఒక కుటుంబ సభ్యుడిగా, సొంత తమ్ముడిలా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. సాయితో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేదని పేర్కొన్నారు.ఈ రోజు సాయి భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు..కానీ తెలంగాణ ఉద్యమకారులు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ గాయకుడువేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

బహిరంగ సభల్లో సాయి మాట్లాడుతుంటే.. రాతిబొమ్మల్లోనా కొలువైన శివుడా పాట పాడితే.. లక్షల మంది కళ్లల్లో నీళ్లు వచ్చేదని అన్నారు. సాయి ఆ పాట పాడుతుంటే తాము కూడా వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నామని గుర్తు చేసుకుంటూ హరీశ్‌రావు భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సాయి కృషిని ఎవరూ మరిచిపోరని చెప్పారు. చట్టసభల్లో అడుగుపెట్టాలనే కల సాయికి ఉండేదని, కెసిఆర్ ఆ అవకాశం ఇస్తారని చెప్పేవారని తెలిపారు. కానీ దురదృష్టం సాయిని వెంటాడుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. గొప్ప కళాకారుడు, నాయుడిని బిఆర్‌ఎస్ కుటుంబం కోల్పోయింది హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News