Monday, December 23, 2024

ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత నాది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడిందని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం ఇందిరాపార్క్-విఎస్‌టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్‌ను రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. “తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో 36వ ఫ్లైఓవర్ ఇది. ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఈ స్టీల్ బ్రిడ్జికి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.అప్పర్ ట్యాంక బండ్, లోయర్ ట్యాంక్ బండ్‌లను కలిపి అద్భుతగా మారుస్తాం. మతాల మధ్య చిచ్చుపెట్టి కొందరు పబ్బం గడుపుతున్నరు” అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News