Wednesday, January 22, 2025

పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించింది: కేటీఆర్

- Advertisement -
- Advertisement -

వ్యవసాయం, ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ కు ఏమత్రం అవగాహన లేదని మరోసారి కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి ఆదివారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. “పాల్వాయి గోవర్థన్ రెడ్డి… కాంగ్రెస్ నిబద్ధత కలిగిన నాయకుడని.. పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎందుకు చేశారో.. బీజేపీ ఎందుకు చేరారో ఎవరికీ తెలియదని విమవర్శించారు. మళ్లీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఎందుకొచ్చారో అర్థం కాదన్నారు. నిన్నటివరకు రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు తిట్టుకున్నది ప్రజలు చూశారని అన్నారు. మునగోడులో మేం చేసిన పనులు కళ్లముందే ఉన్నాయని..మునుగోడులో గులాబీ జెండా మరోసారి ఎగరాలని అన్నారు. దేశంలోనే పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ నల్గొండ జిల్లాకే వస్తుందని కేటీఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News