- Advertisement -
సరైన లక్ష్యంతో ముందుకు సాగితే, విజయం తథ్యమని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. తొలినాళ్లలో కేసీఆర్ కూడా కాంట్రాక్టులు చేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
విజయాలు అందుకోవాలంటే గట్స్ ఉండాలన్నారు. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదనీ, అయితే అవకాశాలు అందిరావాలని ఆయన అన్నారు. గిరిజిన పారిశ్రామికవేత్తలను చూస్తే ఎంతో గర్వంగా ఉందనీ, వారు భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
- Advertisement -