Monday, December 23, 2024

మాది కోతల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ఇది చేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం కాదని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రపంచ చేనేత వారోత్సవ దినోత్సవం సందర్భంగా… యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మున్సిపల్ పట్టణంలో చేనేత వారోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కుటుంబంలో ఉండీ.. చదువుకుని చేనేత సమస్యలు తెలుసుకున్న కేసిఆర్, చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కృషి చేయడమే కాకుండా ప్రతి చేనేత కుటుంబానికి అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అగడకుండానే చేనేతలకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యమ కాలంలో సీఎం కేసీఆర్ అప్పటి ఉద్యమనేతగా పోచంపల్లి నేతల కుటుంబాలను సందర్శించారని, నేతన్న అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

రైతు భీమ తరహాలో నేతలకు జీవిత బీమా అందించేందుకు కృషి చేస్తున్నామని, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కోరిక మేరకు రూ.12.50 కోట్లతో హ్యాండ్లూమ్ పార్క్, నేతలకు భీమా 59 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు పెంచుతున్నాం స్పష్టం చేశారు. టేస్కో ద్వారా మగ్గాలు ఉన్న ప్రతి చేనేత కార్మికులకు ఐడి కార్డు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. గతంలో చేనేత కార్మికులు చనిపోతే 05 వేల రూపాయలు టేస్కోబ్ ద్వారా వచ్చే నిధులను 25 వేలకు పెంచినట్లు, అలాగే ఉప్పల్ భగాయూత్ లో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు కేటాయించి ప్రతి నేతనల కుటుంబానికి ఆర్థిక అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తామని, ఇంతే కాకుండా చేనేత కార్మికులను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

చేనేత సంక్షేమం కోసం రూ.250 కోట్ల విలువైన స్థలం ఐన కోకపేటలో చేనేత భవన్ ఏర్పాటు చేసి కోండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగించడానికే తెలంగాణ సాధించుకున్నామన్న మంత్రి… ఇప్పుడు అందరం ఒకటనే భావన కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News