మంచిర్యాల: 60ఏళ్లల్లో జరగని అభివృద్ధి.. ఈ తొమ్మిదేళ్లలో జరిగిందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం రామకృష్ణాపూర్ ఠాకూర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. “60ఏళ్లల్లో ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఆరు గ్యారంటీలు అంటూ వస్తోంది. కాంగ్రెస్ చెప్పే హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దు.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73వేల కోట్లు జమ చేశాం. అభివృద్ధిలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లతో చెన్నూరు పోటీ పడుతోంది. రూ.1650 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం నిర్మిస్తాం. త్వరలోనే చెన్నూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తాం. పామాయిల్ పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు ఎంతో ఉపయోగం. ధాన్యం దిగుబడిలో పంజాబ్, హరియాణాను అధిగమించాం. వరితోపాటు ఇతర పంటలపై కూడా రైతులు దృష్టి పెట్టాలి” అని పేర్కొన్నారు.
60ఏళ్లల్లో జరగని అభివృద్ధి.. ఈ 9ఏళ్లలో జరిగింది: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -