Saturday, November 2, 2024

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీలు వచ్చాయి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బేగంపేట‌లోని గ్రాండ్ కాక‌తీయలో బుధవారం నిర్వ‌హించిన సిఐఐ స‌మావేశానికి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. స్టార్టప్ ల గురించి రోజు మనము వింటున్నాం. రోజు పేపర్ లో ఎదో ఓ స్టార్టప్ వార్త కనిపిస్తుంది. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో సక్సెస్ ఫుల్ స్టార్టప్ తెలంగాణ. ఏడున్నర సంవత్సరాల తలసరి ఆదాయం 125శాతం, జిఎస్డీపి 130శాతం వృద్ధి చెందాయి. ఇండియాలో తెలంగాణ కంట్రిబ్యూషన్ నాల్గవ నంబర్. టీఎస్ ఐపాస్ అద్భుతమైన విజయం సాధించింది. కొత్త రాష్ట్రం అయినా ఎన్నో రంగాల్లో ముందున్నాం. విభజన సమస్యలు ఇంకా ఉన్న అన్నింటినీ అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కరోనా పాండమిక్ లో కూడా వృద్ధి సాధించాం. తెలంగాణ‌లో మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాము. ఏడున్న‌రేండ్ల పాల‌న‌లో త‌ల‌స‌రి ఆదాయం పెరిగింది. రాష్ట్రంలో త‌ల‌స‌రి ఆదాయం 2.78 ల‌క్ష‌ల‌కు చేరింది. ప‌శ్చిమ బెంగాల్, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర త‌ర్వాత పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ తెలంగాణది. హైద‌రాబాద్‌లో అనేక ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. ప్ర‌భుత్వం ఆవిష్క‌ర‌ణ‌లు, స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హిస్తుంది. తెలంగాణ‌లో ఎన్నో స్టార్ట‌ప్‌లు వ‌చ్చి విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయి.
ప‌రిశ్ర‌మ‌ల‌కు 15 రోజుల్లోనే అనుమ‌తులు ఇస్తున్నాం. 500 మీట‌ర్ల కంటే త‌క్కువ విస్తీర్ణం ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌త్వ‌ర అనుమ‌తి ఇస్తున్నాం. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని పాటు చాలా పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వ‌రం ప్రాజెక్టును మూడేండ్ల‌లోనే పూర్తి చేశాం. కాళేశ్వ‌రం ద్వారా గోదావ‌రి జ‌లాల‌ను ప్ర‌తి ఎక‌రాకు అందిస్తున్నాం. వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. పంజాబ్ కంటే అధికంగా వ‌రి ధాన్యాన్ని పండించాం. సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయ పెట్టుబ‌డి కోసం రైతుబంధు కింద సంవ‌త్స‌రానికి రెండుసార్లు ఎక‌రాకు రూ.5 వేల చొప్పున ఇస్తున్నారు. గ‌త ఏడేండ్ల‌లో రాష్ట్రంలో ప‌చ్చ‌దనాన్ని 24 నుంచి 31 శాతానికి పెంచాము. నాణ్యమైన కరెంట్ రైతులకు పరిశ్రమలు, ఇంట్లో అందిస్తున్నాము. 1987లో ఇండియా, చైనా జిడిపి సేమ్. కానీ 35 సంవత్సరాలలో ఇండియా 2.4 ట్రిలియన్ ఉంటే చైనా 16 ట్రిలియన్ గ్రోత్ సాధించింది.. ఎలా సాధ్యమైంది. మనకంటే చిన్న దేశాలు తైవాన్, సింగా పూర్ లాంటి దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. చైనాలో లార్జ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. మన దగ్గర ఎక్కడ ఉన్నాయి. 1250 ఎకరాల్లో వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఏది?. డిఫెన్స్ ఇండస్ట్రీలో మనము ఏ మేరకు ముందున్నము?. ఆత్మనిర్బర్ భారత్ కింద ఎంత మందికి లాభం చేకూరింది?. సీఐఐ ప్రతినిధులకు విజ్ఞప్తి కేంద్రాన్ని అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని పేర్కొన్నారు.

KTR Speech at CII Meeting in Begumpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News