Tuesday, January 21, 2025

మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మళ్లీ అధికారంలోకి తామే వస్తాం…. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం
వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అనువైన వాతావరణం ఉంది
లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
2030 నాటికి 250 బిలియన్ డాలర్లు పెట్టుబడులను సాధించాలన్న లక్ష్యంతో ముందుకు
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారు
సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో మంత్రి కెటిఆర్
హైదరాబాద్: వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి తామే వస్తామని మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసిన భారతీయ పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) తెలంగాణ వార్షిక సమావేశానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బయో ఏషియా సదస్సును విజయవంతంగా నిర్వహించుకున్నామని, లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. 2013 సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని ఆయన తెలిపారు. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు పెట్టుబడులను సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

నగరానికి ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 9 బిలియన్ టీకాలు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారు అవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కులోనే ఉందని, తెలంగాణలో అతి పెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. దేశానికే హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News