Thursday, January 23, 2025

వారిది రెడ్‌టేప్.. మాది రెడ్ కార్పెట్

- Advertisement -
- Advertisement -

స్వరాష్ట్రంలో మారిన దృశ్యం టిఎస్ ఐపాస్‌తో 15రోజుల్లోనే కంపెనీలకు అనుమతులు

పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 
యువత ఎప్పటికప్పుడు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటేనే భవిష్యత్తు 
ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్.. ఇప్పుడు ఇరిగేషన్

రాష్ట్ర ప్రగతిని గుర్తించని విపక్షాలు.. మహబూబ్‌నగర్ పర్యటనలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో/జడ్చర్ల/మూసాబ్‌పేట: తెలంగాణ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఎర్ర తివాచీ పరిచామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు అన్నా రు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ముసాబ్ పేట మండలం వేముల గ్రామంలో రూ. 500 కోట్ల పెట్టుబడులతో ఎస్‌జిడి కార్నింగ్ కంపెనీకి భూమి పూజ చేశారు. అనంతరం ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వ ర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు పరిశ్రమలు రా వాలంటే రెడ్ టేప్ ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ కార్పెట్ పరిచి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశ జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ రంగ సంస్థ్ధల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేమని, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి ఉద్యోగాలు క ల్పించే విధంగా చూస్తున్నామని అన్నారు. వేముల దగ్గర ఏర్పాటు కానున్న కార్నింగ్ కంపెనీ ద్వారా 2000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఇటీవల దివిటిపల్లిలో రూ. 9500 కోట్లతో అమరరాజా కంపెనీని ఏర్పా టు చేశామని, మహబూబ్‌నగర్ ఐటి హబ్‌లో వేలా ది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నా రు. తెలంగాణ రాష్టం వ్యాక్సిన్‌కు హబ్‌గా ఉందని నూతన పారిశ్రామిక విధానంతో (టిఎస్‌ఐపాస్) 15 రోజుల్లోనే కంపెనీలకు అన్ని అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో 142 కో ట్ల జనాభా ఉంటే కేంద్రంలో 59 లక్షల ఉద్యోగాలు మాత్ర మే ఉన్నాయని, అదే తెలంగాణలో 4 కోట్ల మంది జ నాభా ఉంటే అరున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయన్నారు. రాష్ట్రం అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని, కెసిఆర్ నాయకత్వంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ది రాష్ట్రంలో జ రిగిందన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో గతం లో 40 వేల ఎకరాలకు సాగునీరు ఉం డేదని, అ లాంటిది మిషన్‌కాక తీయ ద్వారా ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆద్వర్యంలో 434 చెరువులు, కుం టలు నింపుకోవడం జరిగిందన్నారు. 30 చెక్ డ్యాం లు పూర్తి చేశామన్నా రు. 2014లో 40 వేల ఎకరాలకు సాగునీరు ఉంటే 2023 నాటికి 98 వేల ఎకరాలకు సాగునీరు అం దుతుందన్నారు. కర్వేన రిజర్వాయర్ పూర్తి అయితే 1.60 లక్షలఎకరాలకు సాగునీరు వస్తుందని కెటిఆర్ స్పష్టం చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ భవనానికి భూమి పూజ
మహబూబ్‌నగర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ భవనానికి మంత్రి కెటిఆర్ భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఒకప్పుడు మహబూబ్‌నగర్ అంటే మైగ్రేషన్ అని.. ఇప్పుడు మహబూబ్‌నగర్ అంటే ఇరిగేషన్ అని అన్నా రు. ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిం ది అనే వాస్తవం గుర్తించాలి. భారీ ఎత్తున ఐటి, ఫార్మా రంగాలతో 5 లక్షల మంది ఐటి ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నారన్నారు. పెద్ద ఎత్తున ఐటి పరిశ్రమలను హైదరాబాద్‌కు తరలిరావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ఫలితమేనని మంత్రి కెటిఆర్ అన్నారు. గతంలో 4 గంటలు కరెంట్ ఉండేది ఇప్పడు 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. గతంలో కరెంట్ కో సం పరిశ్రమల యజమానులు ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించా రు.

కరెంటు ఇవ్వక పోతే కార్మికులకు ఎలా వేతనా లు ఇవ్వాలని, కడుపులు ఎలా నింపాలని గత ప్ర భుత్వాలను నిలదీసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు సాగునీరు లేక ఒక్క పంట కూడా పండేది కాదు.. ఇప్పుడు సాగునీటి జల కళతో వేలా ది మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుండడం వాస్తవం కాదా ? ఇది తెలంగాణ సాధించిన అభివృద్ధ్ది కాదా? అని నిలదీశారు. ఒకప్పటి తెలంగాణ ఇప్ప టి తెలంగాణకు పొంతనే లేదన్నారు. సినీ హీరో రజినీకాంత్ స్వయంగా హైదరాబాద్ ను చూసి అ భివృద్దిపై స్పందిస్తూ ..ఇది అమెరికా లాగా ఉందని మెచ్చుకున్నాడంటే హైదరాబాద్ అభివృద్ది ఎలా చెందిందో ఊహించుకోవాలని కోరారు. ఆ రోజు లో పరిశ్రమల ఏర్పాటుకు రెడ్ టేప్ ఉంటే నేడు తాము పెట్టుబడులు పెట్టే వారికి రెడ్ కార్పెట్లు పరుస్తున్నామన్నారు.

సిఎం కెసిఆర్ రాష్ట్రంలో 1001 గురుకులు పాఠశాలలు ఏర్పాటు చేసి అందులో ప్రతి విద్యార్దికి లక్ష ఖర్చు పట్టె ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తున్నాడన్నారు. ప్రతి విద్యార్థి బాగుండాలి, బాగా చదవాలి, కష్టపడి పైకి రావాలనే తలంపుతోనే గురుకులాలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో ని ర్మించినట్లు తెలిపారు. ఇందులో 6 లక్షల మందికి అత్యుత్తమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. సొంత గడ్డ పాలమూరులో పుట్టిన బివిఆర్ మోహన్ రెడ్డి 18 దేశాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారన్నారు. పాలమూరులో కూడా ఆయన స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News