Thursday, January 23, 2025

మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌తో పాటు సంగీత విద్యపై ప్రాధాన్యంగా ఉండాలి
సంగీత దర్శకుడు ఇళయరాజా అంగీకారంతో తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తాం
‘మ్యూజిక్ స్కూల్ ’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌తో పాటు సంగీత విద్యపై కూడా ప్రాధాన్యంగా ఉండాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అంగీకారంతో తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్ ’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి కెటిఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మాదాపూర్‌లోని దస్పల్లా హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా, శ్రీయ, దిల్ రాజులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మ్యూజిక్ యూనివర్శిటీ లాంటి వ్యక్తి ఇళయరాజాతో కలిసి ఈ వేదిక పంచుకోవడం గౌరవంగా ఉందన్నారు. మనం చిన్నప్పటి నుంచి పిల్లలను ఇలా పెంచాలి అలా పెంచాలని చెబుతామని కానీ, ఈ ‘మ్యూజిక్ స్కూల్’ సినిమాలో పిల్లలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. దర్శకుడు పాపారావు తనకు మంచి మిత్రుడని, తెలంగాణ ఉద్యమం నుంచి ఇక్కడే పనిచేశారన్నారు. తన కొడుకుకు 17 సంవత్సరాలని, అతను సడన్‌గా ఒక రోజు వచ్చి సాంగ్ పాడానని చెప్పాడని కెటిఆర్ పేర్కొన్నారు. చాలామందిలో హిడెన్ మెదడాలజీ ఉంటుందని కెటిఆర్ తెలిపారు.

మ్యూజిక్ ఉంటే లక్ష్మీ, సరస్వతి: ఇళయరాజా
సంగీత దర్శకుడు ఇళయరాజా మాట్లాడుతూ మ్యూజిక్ ఉంటే వైలెన్స్ ఉండదని, చీటింగ్ ఉండదని, మ్యూజిక్ ఉంటే లక్ష్మీ, సరస్వతి ఉంటుందన్నారు. మంత్రి కెటిఆర్ చెప్పినట్టు మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటయితే ఇక్కడ 200 మంది ఇళయరాజాలు తయారు అవుతారని ఆయన తెలిపారు. మ్యూజిక్ యూనివర్సిటీ తాను అంగీకరిస్తున్నట్టు ఇళయరాజా పేర్కొన్నారు. దేశం మొత్తం కూడా ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇస్తారని ఇళయరాజా పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో మనం దేశం నుంచి వెళ్లిన చాలామంది ప్రతిభ చూపిస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News