Monday, December 23, 2024

సమాజంపై రోబోటిక్స్

- Advertisement -
- Advertisement -

అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న రోబోటిక్స్
డ్రైనేజీలలో అడ్డుంకులను గుర్తించడానికి రోబోటిక్‌ను వాడుతున్నాం..
అగ్నిప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇదే టెక్నాలజీ
వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి రాష్ట్రం ప్రోత్సాహం
ఈ రంగంలో ఆర్ అండ్ బికి తెలంగాణలో మంచి అవకాశాలు
మూడు దశాబ్దాల్లో మూడు రెట్లు పెరిగిన వినియోగం
రోబోటిక్స్‌లో దేశం మూడు రెట్లు పెరిగిన వినియోగం
ఐదవ స్థానానికి చేరుకోవాలి టిహబ్‌లో జరిగిన రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్: ప్రపంచంలోనే రోబోటిక్స్ వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారతదేశం రోబోటిక్స్ వినియోగంలో పదో స్థానంలో ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. త్వరలోనే ఐదో స్థానానికి చేరుకునే విధంగా కృషిచేయాలని, అందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఈ రోబోటిక్స్ వినియోగం వ్యసాయం, మెడికల్, పారిశ్రామిక రంగాల్లోనే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో ఉపయోగించాలన్నదే తమ లక్షమని స్పష్టం చేశారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు చోటు చేసుకోవాలన్నారు. మంగళవారం టీహబ్‌లో జరిగిన రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ప్రపంచం అంతా టెక్నాలజీతో వేగంగా ముందుకు సాగుతుందని, ఈ సాంకేతిక యుగంలో ప్రతి దేశంలో రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్నారని తెలిపారు. అగ్రికల్చర్, మెడికల్ రంగాల్లో రోబోటెక్ పరిజ్ఞానం క్రమంగా పెరుగుతోందన్నారు. ప్రపంచంలోనే రోబోటిక్స్ వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారతదేశం రోబోటిక్స్ వినియోగంలో పదో స్థానంలో ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. త్వరలోనే ఐదో స్థానానికి చేరుకునే విధంగా కృషిచేయాలని, అందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.

ప్రస్తుతం సమాజంలో జరిగే చాలా సమస్యలను పరిష్కరించేందుకు రోబోటిక్స్ ఉపయోగపడుతున్నాయన్నారు. వాటి అభివృద్ధిలో ఐటి వినియోగం పెంచాలని టెక్నాలజీని వాడాలని సూచించారు. రోబోటిక్స్ సాంకేతికత వేగంగా పెరుగుతోందని గత మూడు దశాబ్దాల్లో మూడు రెట్లు ఐటి వినియోగం పెరిగిందని అన్నారు. మా అమ్మగారు సైతం కాలక్షేపానికి ఫోన్‌లో యూ ట్యూబ్, వాట్సప్ వంటి ఫీచర్లను వినియోగిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టెక్నాలజి ప్రతి ఒక్కరికి అవసరమని ఎంతో ఆసక్తిగా మారిందని వివరించారు. ఆవిష్కరణలను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే ఈ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మారాలని సూచించారు. సాంకేతిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ రంగంలో వచ్చే ప్రతి కొత్త టెక్నాలజీని నేర్చుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో రానున్న ప్రతి కొత్త ఆవిష్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సలహా ఇచ్చారు.

వచ్చే ప్రతి టెక్నాలజీని అలవాటు చేసుకునేలా తమ ప్రభుత్వం ఉండాలనుకొంటుందన్నారు. వీటి కోసమే రాష్ట్రంలో ఈ రంగంలోని పరిశ్రమలు, అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దేశంలో రోబోటిక్స్ పరిశ్రమలను అవృద్ది పరిచే కార్యక్రమంలో మొదటి స్థానం తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎమర్జింగ్ టెక్నాలజి డైరక్టర్ రమాదేవి, బెల్జియం రాయబారి డిడేర్ వండర్‌షల్లట్, పురుషోత్తమ్ కౌశిక్, రుమాసింగా ,జిఎంఆర్ సిఇఒ జి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు విద్యాసంస్థలు, పరిశ్రమల సంఘాలు,ఇంక్యుబేటర్‌లతో సహా ఐదు సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News