హైదరాబాద్: కరోనా సమయంలో పారిశ్రామిక రంగం కోలుకునేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీతో రాష్ట్రానికి ఒరిగిందేమిలేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పారిశ్రామిక రంగంపై కరోనా మహమ్మారి ప్రభావంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీల కారణంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని, కేంద్రం ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం జరగలేదని చెప్పారు. రాష్ట్రంలో ఈ యేడాది ఇప్పటివరకు 1777 కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు ఆమోదించామని తెలిపారు. కొవిడ్ సమయంలోనూ కొత్త పెట్టుబడుల వృద్ధిలో ఎలాంటి తగ్గుదల లేదని తెలిపారు. కొత్త పెట్టుబడులకు తెలిపిన ఆమోదాలతో 2,06,911 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందన్నారు.
KTR Speech at Telangana Assembly