- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాకుండా ఢిల్లీ నామినేట్ చేసి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని కెటిఆర్ తెలిపారు. పదేళ్లలో మహబూబ్ నగర్ లో వలసలు ఆగిపోయాయని చెప్పారు. ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరో చెప్పాలని కెటిఆర్ ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలోని హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని కెటిఆర్ కోరారు. కోటిన్నర మంది మహిళల ఖాతాలో రూ. 2500 వేస్తామన్నారు..? డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని మహిళలు ఎదురు చూస్తుండ్రు అని ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే స్వాగతిస్తామన్నారు కెటిఆర్.
- Advertisement -