మన తెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి రారని తెలిసే కాంగ్రెస్ వాళ్లు నోటికివచ్చిన హామీలు ఇస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం బిఆర్‌ఎస్‌కే వేయండన్నారు. ఈ ఏడాది జులై 4వ తేదీన పొంగులేటి ఆధ్వర్యంలో వెంకట్రావు బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బిఆర్‌ఎస్‌లో తిరిగి చేరిన భద్రాచలం నేత తెల్లం వెంకట్రావును ఆయన స్వాగతించారు.
తెలంగాణ భవన్‌లో మంత్రులు కెటిఆర్, పువ్వాడ అజయ్ కుమార్, బిఆర్‌ఎస్ భద్రా ద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో వెంకట్రావుతో పా టు భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావు పేట, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి కూడా పలువురు బిఆర్‌ఎస్‌లో చేరా రు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కె టిఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని వ్యా ఖ్యానించారు. కాంగ్రెస్ స్వభావం తెలుసుకోవడానికి తెల్లం వెంకట్రావుకు నెలకంటే ఎక్కువ సమయం పట్టలేదన్నారు. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇచ్చే ఏకైక సిఎం కెసిఆర్‌నే అని, మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమని మంత్రి కొనియాడారు.
దేశమంతా అ డవులను తొలగిస్తుంటే, అందుకు భిన్నం గా తెలంగాణలో మాత్రం అడవులు పెరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. దేశంలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. ఏం చూసి మరి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజలు ధాన్యాన్ని తెలంగాణకు తెచ్చి అమ్ముతున్నారని తెలిపారు. కె సిఆర్ సంక్షేమ పథకాలు అందని కుటుం బం రాష్ట్రంలో ఒక్కటైనా ఉందా?అని ప్ర శ్నించారు. పిల్లల నుంచి పెద్దల దాకా అం దరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయ ని గుర్తు చేశారు. ఈ విషయాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసిన అధికారంలోకి రామని తెలిసే నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచామని గుర్తుచేశారు. పోడు భూములకు పట్టాలిచ్చి రై తుబంధు ఇచ్చింది కెసిఆర్ కాదా? అని ప్రశ్నించారు. స్వాతంత్య్ర భారతంలో 70 ఏళ్లలో రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చిన ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. కొందరు నాయకులు కూడా పథకాలు తీసుకుంటున్నారు.. పైగా కెసిఆర్‌నే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మరి రైతులకు సహాయం చేయని కాం గ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ ప్ర శ్నించారు. కమ్యూనిస్టులు, నక్సలైట్లు ఒకప్పుడు చె ప్పిన సమ సమాజ స్థాపన ఇప్పుడు సాగుతుం దన్నా రు. అన్ని వర్గాల వారికి సమాజంలో అందరికీ అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. పేద రైతులకు సంక్షేమ పథకాలు ఇస్తే ఓర్వలేని కాంగ్రెస్ పా ర్టీ తెలంగాణ ప్రజలకు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తీసుకుంటూ కెసిఆర్‌పై విమర్శ చేయడం అ లవాటుగా మారిందని ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఒకప్పుడు మనం అనుకునే తెలంగాణ కోటి రతనాల వీణ… ఇవాళ కోటి ఎకరాల మాగాణంగా మారిందన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టులను పునరుద్దరించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని కెటిఆర్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమాను వ్య క్తం చేశారు. ఈ విషయం విపక్షాలకు కూడ తెలుసునన్నారు. ఒకప్పుడు కొమురం భీం కోరుకున్న జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తిని తెలంగాణ ప్ర భుత్వం ముందుకు తీసుకుపోతుందన్నారు. భద్రాద్రి రామాలయాన్ని తీర్చిదిద్దే బాధ్యత బిఆర్‌ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. భద్రాచలంలో వరద నివారణకు శాశ్వత కరకట్టలు కడతామని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చాలామంది ఉపాధి పొం దుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారని, 50ఏళ్లు అ వకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొండి, ఓటు మాత్రం బిఆర్‌ఎస్‌కే వెయ్యండని సూచించారు. రానున్న రోజుల్లో ప్రభల శక్తిగా బిఆర్‌ఎస్ ఎదుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
పొంగులేటిపై పువ్వాడ సీరియస్
బిఆర్‌ఎస్ పార్టీ వల్ల పెద్దవాళ్లుగా పేరుతెచ్చుకున్న కొందరు ఇప్పుడు అదే పార్టీకి ద్రోహం చేస్తున్నారం టూ పరోక్షంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ సీరియస్ అయ్యారు. ఇలాంటివారు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వారికి ఉద్యమనాయకుడు కెసిఆర్‌ను విమర్శించే స్థాయి లేదు, ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిదని పొంగులేటిని పువ్వాడ హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించారన్నారు. కాబ ట్టే రెండోసారి ప్రజలు ఆయనకే అవకాశం ఇచ్చారన్నారు. ఈసారి కూడా సుపరిపాలన అందించిన కెసిఆరే వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయి హ్యా ట్రిక్ సాధించబోతున్నారని మంత్రి పువ్వాడ జోస్యం చెప్పారు. యావత్ తెలంగాణతో పాటే ఖమ్మం జిల్లాలోనూ కెసిఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
ఖమ్మం జిల్లా బిడ్డగా తన జీవితంలో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ తొమ్మిదేళ్లలో చూశానన్నారు.
కాబట్టి పనిచేసిన ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలపై ఉందన్నారు. ఖమ్మం జిల్లాలోని మారుమూల గూడెంలు, తండాల కు గతంలో రోడ్డు, విద్యుత్ సౌకర్యం ఉండేదికాదు, కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అలాంటి ప్రాంతాలకు అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించి దాహం తీర్చారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజనులకు లక్షన్నర ఎకరాల పట్టాలు ఇచ్చిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని పువ్వాడ కొనియాడారు. ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ అదిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీ సైనికులుగా పనిచేసి గెలిపించుకుంటామని, ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందన్నారు. రానున్న మూడు నెలల్లో ప్రతి ఇంటికి గడపకు వెళతామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే మన ప్రభుత్వంలో మన ఎంఎల్‌ఎలే ఉంటే అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది… ప్రజల ఆకాంక్షలు వేగంగా నెరవేరుతాయని రవాణ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.