Sunday, December 22, 2024

కాంగ్రెస్సోళ్లు అప్పుడే ఉలికి పడుతున్నారు.. కేసీఆర్ వస్తే ఇంకెలా ఉంటుందో: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అవతలి వాళ్లు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని కెటిఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహాక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ.. మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారని.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండని చెప్పారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగన లేదని.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారన్నారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టె ప్రయత్నం చేస్తోందని..అయినా వదిలి పెట్టం..ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని విమర్శించారు. కోమటిరెడ్డి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని.. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపండన్నారు.

సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందని చెప్పారు. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును.. కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందన్నారు. శ్రీరాం సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండ బెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో అపుడే కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడిందనని.. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోడీ బీఆర్ఎస్ ను కాలుస్తారట.. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్, బీజేపి అక్రమ సంబంధం గురించి చెప్పాలన్నారు. రాహుల్ అదానీని దొంగ అంటే.. రేవంత్ దొర అంటున్నాడని కెటిఆర్ అన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News