Sunday, December 22, 2024

ప్రియమైన కాదు.. పిరమైన ప్రధాని

- Advertisement -
- Advertisement -

వన్ నేషన్.. వన్ టాక్స్.. వన్ రేషన్ అని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభత్వం ‘ఏక్ దేశ్..ఏక్ దోస్త్’ పథకాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తు దేశ సంపదను తన దోస్త్ ఆధానికి దోచిపెడుతుండని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు (కేటీఆర్) ఆరోపించారు. ఆయన ప్రియమైన ప్రధాని కాదని ఆయన పిరమైన ప్రధానిగా అభివర్ణించారు. జన్ ధన్ ఖాతాలు తెరవండి అంటూ ఎన్నికల ముందు ప్రఛారం చేసిన మోడీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతుంది.. ఎన్ని ఖాతాల్లో సొమ్ములు పడ్డయో జనాలే చెప్పాలని ప్రశ్నించారు. జనాల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా పడకున్నా తన దోస్త్ ఖాతాల్లోకి మాత్రం జనాల సొమ్ము తరలివెలుతుందని విమర్శించారు.

నల్లధనం రప్పించి పేదలకు పంచుతామని చెప్పిండ్రు.. ఒక్క రూపాయి కూడా పంచలేదు.. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రూ. 65 వేల కోట్లను ప్రతి ఏటా తెలంగాణలోని 65లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం పేరిట జమ చేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆయన బుధవారం రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రమైన తొర్రూరులో రూ.1555 అభివృద్ది పనుల అభివృద్ది పనులతో పాటు రాష్ట్రంలోనే మొదటి సారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వడ్డీలేని రూ.750కోట్ల రుణాల పంపిణీకి మంత్రి చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి అద్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
ప్రియమైన కాదు.. పిరమైన ప్రధాని..
ప్రియమైన ప్రధాని అంటూ బిజెపి పార్టీ నేతలు పేర్కోంటుంటారు.. కానీ అయన పాలనలో అన్ని నిత్యవసర ధరలు పెంచుతూ పిరమైన ప్రధానిగా మారిపోయాడని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. మాతో పాటు అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ నాలుగు వందలున్న గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు రూ.1200 పెంచి ఆనందంగా ఉన్నారన్నారు. దేశంలో జనాలు పిచ్చోళ్లు ఉన్నారని కర్రుకాల్చి వాతపెట్టరులే అని అనుకుంటూ పప్పు, ఉప్పు, గ్యాస్, పెట్రోలు ధరలు పెంచి నడ్డివిరుస్తున్నారని ద్వజమెత్తారు. పిరమైన కాస్ట్‌లీ ప్రధానిగా మారిపోయారని ఎద్దెవా చేశారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు. ఎక్కడైనా డబుల్ అయ్యిందా అని జనాలను ప్రశ్నించారు.

బిజెపి పాలిత రాష్ట్రంలో ఇటీవల టామాటా రైతు పండించిన పంటను అమ్మడానికి వెల్తే కేవలం రెండు రూపాయాల మునాఫా మాత్రమే మిగలడం అత్యంత శోచనీయమన్నారు. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడుతానన్నారు. అది గుజరాత్‌కు తరలించి అక్కడ రూ. 20 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నారన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు ఏమైందని బిజెపి నేతలను మంత్రి కేటీఆర్ నిలదీశారు.
ఏ వర్గానికి మేలు చేశారో చెప్తారా..?
మీరు మాతో పాటు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు కదా.. మీరు తెలంగాణలో ఏ వర్గానికి మేలు చేశారో వివరిస్తారా అని బిజెపి నేతలకు సవాల్ చేశారు. మేం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న మంత్రులు ముగ్గురం నాతో పాటు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌లు ఇక్కడ ఉన్నాం. మేం ఏమీ చేస్తున్నామో గంటపాటు గంటాపథంగా వివరించే దమ్ము మాకు ఉంది. మీకు ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళ, విద్యార్థి, రైతులు, అన్ని సామాజిక వర్గాలకు మేలు చేస్తున్న ఘనత తెలంగాణ సర్కారుదని పేర్కోన్నారు. నల్లధనం తీసుకువచ్చి ఒక్కోక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని ప్రగల్భాలు పలికారు. ఒక్కరి ఖాతాలో పడలేదు కానీ తన దోస్తు ఖాతాలోకి ప్రజాధనం వెలుతుందని ఆరోపించారు. శ్రీలంక వెళ్లి ప్రధాని తన దోస్త్‌కు ఆధానికి ఆరువేల కోట్ల ప్రాజెక్టును అప్పగించింది నిజం కాదా అని నిలదీశారు. మీరు చేసింది హిందూ, ముస్లీం మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.
ఆడబిడ్డల సాక్షిగా 1555కోట్ల నిధులు..
పాలకుర్తి నియోజకవర్గ ఆడబిడ్డల సాక్షిగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా రూ. 1555 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలో మహిళలకు చిరుకానుకగా రూ. 750 కోట్ల రాష్ట్రంలోని మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీకి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఇలాకాలోనే పంపిణీకి శ్రీకారం చుడుతున్నమని పేర్కోన్నారు. అభయహస్తం సొమ్ములు మహిళలకు తిరిగి చెల్లించేందుకు కేటాయించిన రూ. 545.95 కోట్ల నిధులు. శ్రీనిధికి సంబంధించి నిధులు రూ.50.69కోట్లు, పాలకుర్తికి నియోజకవర్గానికి సంబందించి లింకేజీ రుణాలు రూ.204 కోట్లు మొత్తంగా రూ. 1555కోట్ల నిధులు మహిళల సాక్షిగా అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అత్యున్నతమైన పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నోజాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారని ప్రశంసించారు.

కేంద్రం ప్రవేశపెట్టిన సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకంలోనే ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఘనత మన రాష్ట్రం దక్కించుకుందన్నారు. దేశ వ్యాప్తంగా ఇరవై గ్రామ పంచాయితీలు ఎంపిక కాగ అందులో తెలంగాణకు చెందిన 19 గ్రామపంచాయితీలు ఉండడం గర్వకారణమన్నారు. త్రైమాసిక నివేధికల్లో త్రీ, ఫోర్ స్టార్ ర్యాంకింగ్‌ల్లో దేశంలోనే ఆరింటికి ఇస్తే అందులో నాలుగు జిల్లాలు మన రాష్ట్రానికే ర్యాంకింగ్‌లు ఇస్తే మనకే దక్కడం మన ఘనత కాదా అన్నారు. దేశానికే మన గ్రామపంచాయితీలు అగ్రగామీగా నిలిచాయన్నారు. కేంద్రమే ఉత్తమ సంసద్ ఆదర్శ యోజన పథకం ద్వారా అవార్డులను ప్రకటించి ప్రశంసిస్తున్నది వాస్తవం కాదా అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు కేసీఆర్ ఆలోచనల మేరకు పనిచేయడం వల్లే గ్రామాభివృద్ది ఆదర్శవంతంగా మారుతుందన్నారు. ఏ గ్రామం వెళ్లిన హరిత హారం చెట్లు స్వాగతం పలుకుతున్నాయన్నారు.

ప్రతి గ్రామంలో నర్సరీ, డంపింగ్ యార్డు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠదామాలు దర్శనమిస్తున్నాయన్నారు. పల్లెటూరుకు ఏం కావాలో అవన్ని చేస్తున్నామన్నారు. అలకటి పనులే అయితే గ్రామాల్లో చెరువులు, వాటిపై చెక్‌డ్యాంలు కనబడుతున్నాయి. చెరువులు నిండుగా, కాల్వల్లో ఎండాకాలంలో కూడా గోదావరి నీళ్లు కనిపిస్తున్నాయంటే అవి కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత కాదా అన్నారు. కేసీఆర్ రాక ముందు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పడు కరెంట్ పోతే వార్త అని తెలిపారు. అంజుమన్ బ్యాంకువాళ్లు లోను కట్టకపోతే ఇంట్లో వస్తువులు తీసుకువెళ్లేవారు. ఇప్పుడు ఉందా అని ప్రశ్నించారు. మేం చెప్పే మాటలు నోటి మాటలతో అయితే 67 ఏళ్లుగా మీరెందుకు చేయలేకపోయారో చెప్పాలన్నారు. నోటిపనులతో అయితే రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయితీల్లో ఒక్కో గ్రామంలో ఇంటింటికీ నీళ్లు, ట్రాక్టర్స్, ట్యాంకర్లు , హరిత హారం చెట్లు, నర్సరీలు, వైకుంఠదామాలు, క్రీడాప్రాంగణాలు, డంపింగ్ యార్డులు పట్టణానికి పరిమితమైన పార్కులు గ్రామాలకు అందించిన ఘనత కేసీఆర్‌దే అని పేర్కోన్నారు.

ఇంత వేగంగా అభివృద్ది దేశంలోని మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు జరుగడం లేదని మంత్రి నిలదీశారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి పల్లెప్రగతి కార్యక్రమంతో కేసీఆర్ మార్గదర్శకత్వం పనిచేస్తూ ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారని ఆయన సేవలను కేటీఆర్ ప్రశంసించారు. పల్లెటూరుకు ఏం కావాలో తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు.
తొర్రూరుకు రూ. 25 కోట్లు మంజూరు
తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ది పనులకోసం ప్రత్యేకంగా రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నేతన్నల కోసం కొడకండ్లలో ఇరవై ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మిని టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కోసం జీవోను మంత్రి ఎర్రబెల్లికి అందజేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో వంద పడకలు, పాలకుర్తిలో యాబై పడకల ఆస్పత్రి ఏర్పాటు విషయంలో వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకువెళ్లి తాను బాద్యత తనదేనంటూ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలో ఎవరూ కోరకున్నా మహిళా దినోత్సవం సందర్భంగా పది వేల మంది ఆడబిడ్డలకు కుట్టుమొషన్లు అందించేందుకు ముందుకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లిని ఆయన అభినందించారు. ఇంత మంచి నాయకుడిని అన్ని వేళళ్లో గుండేల్లో పెట్టుకోవాలని ప్రజలకు మంత్రి కేటీఆర్ విజ్ఙప్తి చేశారు. ఒకప్పడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనేటోళ్లు.. ఇప్పుడు సర్కారు దవాఖానాకే వెల్తామంటున్నారు.

పుట్టిన బిడ్డ నుంచి ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్య వరకు చదువుకున వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తున్నారన్నారని వివరించారు. వెయ్యు గురుకుల పాఠశాలలు, ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు. మా తండాల్లో మా రాజ్యం అంటూ నాలుగు దశాబ్దాలుగా కోరికను కేసీఆర్ తీర్చి తండాలను గ్రామపంచియితీలు ఏర్పాటు చేశారన్నారు. ఇన్ని పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని, మంచి నాయకులకు మరో అవకాశం ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలకు బ్యాంరు లింకేజీ రుణాల చెక్కు, అభయ హస్తం, వడ్డీ లేని రుణాలకు సంబందించిన చెక్కలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఇంకా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు ప్రసంగించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మైన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News