Monday, December 23, 2024

అవును… మాది కుటుంబ పాలనే: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రం యాదాద్రి పవర్ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పిఎఫ్ సి, ఆర్ఇసి లకు ఫోన్ చేసి రుణాలు ఇవ్వద్దని బెదిరిస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి కక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. దక్షతతో తాము పని చేస్తుంటే… కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తుందని ఫైర్ అయ్యారు. ”అవును.. మాది కుటుంబ పాలనే”నని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది మా కుటుంబమే అని మంత్రి వివరించారు. పోడు భూముల విషయంలో తప్పు పట్టాల్సివస్తే.. అది కాంగ్రెస్ సర్కార్ నేనని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News