Thursday, January 23, 2025

చేనేతకు రూ.1200 కోట్ల బడ్జెట్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని నేతలకు మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. సిఎం కెసిఆర్ ఆలోచనల మేరకు అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి కోసం అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. నేతన్నల బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టామని, చేనేత, జౌళి రంగానికి చరిత్రలో లేనట్టుగా ప్రతి సంవత్సరం 1200 కోట్ల బడ్జెట్ కేటాయించామని కెటిఆర్ తెలియజేశారు. సిఎం కెసిఆర్ మార్గనిర్దేశంతో చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అమలు చేస్తున్నామన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేనేత రుణమాఫీ పథకం తీసుకొచ్చిందని కెటిఆర్ ప్రశంసించారు. చేనేత రుణమాఫీ కింద లక్ష రూపాయల రుణమాఫీ చేశామని వివరణ ఇచ్చారు. 10148 చేనేత కార్మికులు రూ.28.97 కోట్ల రుణాల నుంచి విముక్తి కల్పించామని వివరణ ఇచ్చారు.

Also Read: పాముతో ప్రేమలో పడిన ఆవు (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News