Monday, December 23, 2024

బోస్టన్‌తో దోస్తీ

- Advertisement -
- Advertisement -

ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటి రంగాల్లో హైదరాబాద్‌తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చిన బోస్టన్ నగరం

ఆరోగ్య రంగంపై జరిగిన
గ్లోబల్ ఇన్నోవేషన్–2022
సదస్సులో పాల్గొన్న
మసాచుసెట్స్ గవర్నర్
చార్లీబేకర్ ఆసక్తి, హామీ
హైదరాబాద్‌బోస్టన్‌ల మధ్య
అనేక సారూప్యతలున్నాయి:
బేకర్ హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా
పేరు తెచ్చుకుంది, రెండు
నగరాల మధ్య అవగాహన
కోసం చేపట్టే కార్యక్రమాల వల్ల
హైదరాబాద్‌కు మరిన్ని
పెట్టుబడులు: సదస్సులో
ముఖ్య అతిథిగా పాల్గొన్న
మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ సిటీ ముందు కు వచ్చింది. బోస్టన్‌లో ఆరోగ్య రంగంపై జరిగిన ‘గ్లోబల్ ఇన్నోవేషన్-2022’ సదస్సులో పాల్గొన్న మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్ మంత్రి కెటిఆర్‌కు ఈ మేరకు హామీఇచ్చారు. బోస్టన్‌లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ – 2022 ఆరోగ్య రంగంపై జరిగిన సదస్సులో కెటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ కు, బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని చార్లీ బేకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ తరహాలో నే బోస్టన్‌లో కూడా ఫార్మా, లైఫ్ సైన్సె స్, ఐటీ రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయన్నారు. రెండు రాష్ట్రాల మ ధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు లై ఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని చార్లీ బేకర్ అభిప్రాయ పడ్డారు. తద్వారా ఈ రం గంలో అనేక నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. బోస్టన్‌లో హెల్త్ రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతుందని, తద్వారా అక్కడి పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయన్న విషయాన్ని బేకర్ ప్రస్తావించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఈ డిజిటల్ హెల్త్ రికార్డుల వలన వేగంగా వారికి చికిత్స అందించేందుకు అవకాశం కలిగిందని ఆయన తెలిపారు.
బయో లైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రాధాన్యం : కెటిఆర్
ఇరు నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాల వలన భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. బయో లైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపత్యంలో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి కెటిఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత వలన సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, ఆయా రంగాలకు ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో హెల్త్ రికార్డ్‌లను డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు.
జీనోమ్ వ్యాలీలో ప్రత్యేక ఇంకుబేటర్
హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా పేరు తెచ్చకుందని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, పాలసీ పరమైన నిర్ణయాలు, ఇన్నోవేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయడం, జీనోమ్ వ్యాలీలో ప్రత్యేకంగా ఒక ఇంకుబేటర్ ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకుందన్నారు. ప్రస్తుతం వీటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ బయో లైఫ్ సైన్సెస్ ఫార్మా ఉత్పత్తులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు.
పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ
ప్రస్తుతమున్న లైఫ్‌సైన్సెస్ రంగంలోని సైంటిస్టులతోపాటు ఐటి, టెక్ రంగాల డాటా సైంటిస్టుల చేస్తున్న ఉమ్మడి కృషితో రానున్న రోజుల్లో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత వలన రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా బయో, లైఫ్ సైన్సెస్ రంగాల్లో టెక్నాలజీకి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న నోవర్టిస్ లాంటి కంపెనీల కార్యకలాపాలను ఉదహరించి, హైదరాబాద్ నగరంలో ఉన్న అవకాశాల గురించి మంత్రి కెటిఆర్ వివరించారు. ఈ రంగాల్లో పరస్పర సహకారం కోసం కలిసి పనిచేయాలని బోస్టన్ అధికారులు, రాష్ట్ర ప్రతినిధుల బృందం ఓ అంగీకారానికి వచ్చింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్, నిర్వాణ హెల్త్ కేర్ చైర్‌పర్సన్ జాన్ స్కల్లి, సీఈఓ రవి ఐక, శశి వల్లిపల్లిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News