Monday, December 23, 2024

అప్పుల గురించే చెబుతుర్రు.. మేం సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

విద్యుత్ శాఖలో అప్పుల గురించే మాత్రమే చెబుతుర్రు.. మేము సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కెటిఆర్ మాట్లాడుతూ..  విద్యుత్ ప్లాంట్లు కట్టడం మేము చేసిన తప్పా అని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ను పూర్తి చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో ఆప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి.

విద్యుత్ రంగంలో గత పదేళ్లలో రూ.1,37,571 కోట్ల ఆస్తులను సృష్టించాం. కేవలం అప్పులు చూపించి గృహజ్యోతి పథకం నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు 24గంటలు ఇచ్చామని.. ఒక్క ఏడాది కూడా క్రాప్ హాలీడే ఇవ్వని ఘనత కెసిఆర్ కు దక్కుతుందని ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News