Sunday, December 22, 2024

ఢిల్లీ దొరలు కెసిఆర్‌పై పగబట్టిన్రు

- Advertisement -
- Advertisement -

రోడ్ షోలలో మాట్లాడారు. మా ధైర్యం తెలంగాణ ప్రజలని, మమ్మల్ని ప్రజలే కాపాడుకుంటారనే విశ్వాసం రు. కాంగ్రెస్, బిజెపి స్థానిక నేతలు దద్దమ్మలని, ఢిల్లీ దొరలు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అంటారని, బిఆర్‌ఎస్ నాయకులు తెలంగాణలో టికెట్లు తెచ్చుకుంటే బిజెపి, వారు ఢిల్లీలో టికెట్లు తెచ్చుకుంటారని, స్థానిక బిజెపి, కాంగ్రెస్ నా యకులకు ఎక్కే విమానం,దిగే విమానం తప్ప ఇంకేం తెలువదన్నారు. బిజెపి, కాంగ్రెస్ స్థానిక నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఢిల్లీ దొరలనెందుకు తెస్తారన్నారు. దద్దమ్మలు కాబట్టే స్థానికంగా ప్రచారం చేసుకునే దమ్ములేక ఢిల్లీ దొరలపై ఆధారపడ్డారన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బిజెపి నేతలు సంక్రాంతికి గంగిరెద్దుల వారు వచ్చినట్లుగా వచ్చి కాకిరిబీకిరిగా అరుస్తారని, ప్రజలు ఆగం కావద్దని అన్నారు. మన ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎన్ని ఆలోచిస్తామో అలాగే ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టాలో బాగా ఆలోచించాలన్నారు.

సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పాలిస్తున్న తొమ్మిదన్నరేళ్లలో రెండేళ్లు కరోనా వల్ల, ఒక సంవత్సరం ఎంపి, ఎంఎల్‌ఎ వంటి రకరకాల ఎన్నికల వల్ల అభివృధ్ధి పనులు చేయలేక పోయామని, మిగిలిన ఆరున్నరేళ్లలో చేసిన అభివృధ్ధి ప్రజల కళ్ల ముందు ఉందన్నారు. 2014కు ముందు తెలంగాణ ఎట్లా ఉన్నది, ఇప్పుడు తెలంగాణ ఎట్లున్నది ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ. 200 రూపాయలు పెన్షన్‌గా ఉమ్మడి రాష్ట్రంలో 29 లక్షల మందికి ఇస్తే ప్రస్తుతం తెలంగాణలో రూ. 2000 రూపాయల పెన్షన్ 46 లక్షల మందికి ఇస్తున్నామన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడి కార్మికులున్నా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు కెసిఆర్ పెన్షన్లు అందిస్తున్నారన్నారు. నడిచే ఎద్దునే పొడుస్తారన్నట్లు 2014 కటాఫ్ డేట్ పెట్టారని కొందరు బీడీ కార్మికులు ఆందోళన చెందుతున్నారని అయితే డిసెంబర్ 3 తర్వాత మిగిలిన మరో 50 వేల మంది బీడీ కార్మికులకు కూడా పెన్షన్ అందిస్తామన్నారు. ఒకప్పుడు కరెంట్ కోతలు అధికంగా ఉండేవని, కాంగ్రెస్ హయాంలో మనిషి చనిపోతే స్నానం చేయడానికి అరగంట కరెంట్ కోసం బ్రతిమిలాడే పరిస్థితి నుంచి నేడు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు.

రైతులు 65 ఏండ్ల దరిద్రపు కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి కరెంట్ కోసం బావుల వద్దకు వెళ్లి పాములకాటుకు, తేళ్ల కాటుకు గురై మరణించారన్నారు. చెరువులు, కుంటలు ఎండిపోయాయన్నారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లాలంటే తాగునీటి కోసం ఎక్కడ ప్రజలు బిందెలతో అడ్డుకుంటారోనని భయపడేవారన్నారు. ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లు కట్టాల్సి వచ్చేదన్నారు. అలాంటి కాంగ్రెస్ దరిద్రాన్ని మళ్లీ తెద్దామా అని ప్రశ్నించారు. ఆరున్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కెసిఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారని, ఇంటింటికి తాగునీరు అందించారన్నారు. సాగునీరు సాధించుకున్నామన్నారు. బిజెపి, కాంగ్రెస్ నాయకులు వచ్చి చెప్పే తప్పుడు మాటలు నమ్మవద్దన్నారు. కెసిఆర్ అనవసరంగా 24 గంటల కరెంటిస్తున్నారని, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని అంటున్న రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి మళ్లీ మూడు గంటల కరెంటిచ్చే దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన రోజులు తెచ్చుకుందామా అని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దొరల పాలన పోవాలని, ప్రజల పాలన రావాలని అంటున్నాడని పేర్కొంటూ రాహుల్, మోడీ ఢిల్లీ దొరల పాలన పోవాలని అన్నారు. బిఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను వివరించి వాటిని తప్పకుండా అమలు పరుస్తామన్నారు. ఈ నెల 30న ప్రజలు కారు గుర్తుకే ఓటు వేయాలని, వేములవాడలో చలిమెడ లక్ష్మీనర్సింహరావును, సిరిసిల్లలో తనను గెలిపించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News