Tuesday, November 5, 2024

కరుగుతున్న కలనేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మన రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ టెక్స్‌టైల్ రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి కె. తారక రామారావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టిందన్నా రు. ఎనిమిదేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అందిన ప్రోత్సాహమేదీ లేదని కెటిఆఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్ర వేశపెట్టబోయే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదేనని కెటిఆర్ ఆన్నారు. వచ్చే ఏడాది కేవలం ఓ ట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే  వీలు ఉంటుందన్నారు.అందుకే ఈ బడ్జెట్లోనే భారీగా నిధులు కేటాయించి నేతన్నలు, టెక్స్ టైల్ రంగం పట్ల తమ చిత్తశుద్ధిని మోడీ సర్కార్ నిరూపించుకోవాలని సూచించారు.

రానున్న బడ్జెట్ లోనైనా టెక్స్ టైల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు అందివ్వాలని మంత్రి కోరారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తి చేశామని, ప్రతిసారి ఆర్థికశాఖ మంత్రులు మారుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్లో టెక్స్‌టైల్ రంగానికి దక్కుతున్నది శూన్యమని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.1600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ టెక్స్‌టైల్ పార్క్ ఖర్చులో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని కెటిఆర్ అన్నారు. ఈసారి బడ్జెట్లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ మౌలిక వసతులు కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కనీసం రూ. 900 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేయకపోవడం వలన పాలసీ ప్రోత్సాహకాలు లేకపోవడం వలన పక్కనున్న బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్నదేశాల కంటే టెక్స్‌టైల్ రంగంలో భారత్ వెనుకబడిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సందర్భంగా గుర్తుంచుకోవాలని కెటిఆర్ కోరారు.

చిన్న దేశాలతో పోటీ పడేందుకు కేంద్ర ప్రభుత్వానికి 8 సంవత్సరాల కాలం సైతం సరిపోలేదా అని కెటిఆర్ ప్రశ్నించారు. మరోవైపు కిటెక్స్ లాంటి అంతర్జాతీయంగా పేరు ఉండిన భారీ సంస్థ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్ లాంటి మౌలిక వసతులు,పాలసీ ప్రోత్సాహకాల వలన మన దేశంలోనే ఉండిపోయిన విషయం వాస్తవం కాదా అన్నారు. ఐదేళ్ల కిందనే ఒక రాష్ట్రంగా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలతో పోటీపడే విధంగా భారీ మౌలిక వసతుల కల్పన చేపట్టి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఎనిమిది సంవత్సరాల లో ఇలాంటి ఒక భారీ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం బాధాకరం అని మంత్రి కెటిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు 5000పైగా పవర్లూమ్ మగ్గాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు అందించే వీలుందని, ఈ మేరకు కేంద్రం నిధులు అందించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్ లో 25 వేలకు పైగా పవర్లూమ్ మగ్గాలు ఉన్నాయని, ఈ బడ్జెట్లో దీన్ని ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్‌గా గుర్తించి, ఈ ప్రాజెక్టు కోసం కనీసం రూ.100 కోట్ల రూపాయల కేంద్ర నిధులను అందించాలని కెటిఆర్ కోరారు. మరోవైపు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ స్కీం, టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు కెటిఆర్ తెలిపారు. సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూచైన్ బలోపేతం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ వంటి ఖర్చుల కోసం సుమారు రూ.990 కోట్ల అవసరం అవుతాయని ఇందులో సింహభాగాన్ని ఈ బడ్జెట్ లో కేటాయించాలని కోరారు. ఇప్పటికే పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పవర్లూమ్ రంగాన్ని తెలంగాణలో బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తుచేశారు.

రాష్ట్రంలో సుమారు 40వేల హ్యాండ్లూమ్ కార్మికులు పని చేస్తున్నారన్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి, గద్వాల్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కళ పైన డిప్లమా చేసేందుకు ఇక్కడి విద్యార్థులకు అవకాశం లేదని వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ పొందుతున్న నేపథ్యంలో తెలంగాణకి ఈ విద్యాసంస్థ మంజూరు చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉండడంతో పాటు ఇక్కడి చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడుతుందని కెటిఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి గుండ్ల పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో అవసరమైన స్థలం అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా మంత్రి కెటిఆర్ తెలిపారు. దీంతోపాటు నేషనల్ టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యండ్ లూమ్ ఎక్స్పొర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ ఏర్పాటును ఈ బడ్జెట్ లో ప్రకటించాలని మంత్రి కోరారు.

అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో పాటు మౌలిక వస్తువులు కల్పన ద్వారా దేశ టెక్స్ టైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్న ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నదని, కానీ గత బడ్జెట్ కేటాయింపులను చూస్తే టెక్స్‌టైల్ రంగాన్ని కాపాడుకుంటున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల పట్ల ప్రగతి నిరోధకుల పాత్రను కేంద్రం పోషిస్తున్నదని మంత్రి కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ బడ్జెట్‌లో నైనా తెలంగాణ టెక్స్‌టైల్ రంగానికి భారీగా నిధులు కేటాయించి నేతన్నల పట్ల టెక్స్ టైల్ రంగం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకోవాలని కెటిఆర్ సూచించారు. లేకుంటే మరోసారి దేశంలోని నేతన్నలు, టెక్స్‌టైల్ రంగం పట్ల తమకున్న చిన్న చూపును కేంద్రం చాటుకున్నట్లు అవుతుందని కెటిఆర్ తెలిపారు. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడంతోపాటు గత ఏడు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అమలుచేస్తున్న చేనేత, టెక్స్‌టైల్ వ్యతిరేక విధానాలను పునర్ సమీక్షించుకోవాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు.

నేత కార్మికులకు రద్దు చేసిన పొదుపు పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు విషయంలో కేంద్రానికి మంత్రి కెటిఆర్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. చేనేతలపై పన్నును పూర్తిగా రద్దు చేయాలని, ఈ మేరకు ఈ బడ్జెట్ లో పన్ను మినహాయింపును ప్రకటించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News