Wednesday, January 22, 2025

మావి కిట్లు.. ప్రతిపక్షాలవి తిట్లు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : మేం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు లాంటి వినూత్న కార్యక్రమాలతో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుంటే విపక్షాలుప్రభుత్వంపై మంత్రి కే తారక రామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సిరిసిల్ల పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే గాలిలో దీపంలా ఉండేదని.. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం కొత్త రూపం దాల్చిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. 9 ఏళ్లకు ముందు ప్రజారోగ్య వ్యవస్థ, ప్రస్తుత ప్రజారోగ్య వ్యవస్థను పరిశీలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనినాడు సర్కార్ దవాఖానా అంటే దైన్యం.. నేడు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే ఒక ధైర్యమని చెప్పారు. అందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా నే నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో వైద్యరంగంలో సంతరించుకున్న మార్పులను వివరించారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి, వేములవాడ ప్రాంతీయ వైద్యశాల లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన అధునాతన, ఖరీదైన పరికరాలు, వైద్య సేవలను వివరించారు.స్వరాష్ట్రంలో సిఎం కేసిఆర్ వైద్యరోగ్య వ్యవస్థ పటిష్ఠానికి అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ కిట్ల నుంచి న్యూట్రిషన్ కిట్ల దాకా.. డయాలసిస్ సెంటర్ల నుంచి డయాగ్నొస్టిక్ కేంద్రాల దాకా.. ప్రతి ఆలోచన ప్రతిష్టాత్మకమని, ప్రతి నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రస్థానం దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయమని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో కవులు, జర్నలిస్ట్ లు ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి పై వ్యగ్యంగా ‘ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే దశాబ్దాల దుస్థితి నుంచి& చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు అనే ధీమానిచ్చిన ధీరోదాత్తమైన నాయకత్వం తెలంగాణ సొంతం అని మంత్రి అన్నారు.

జిల్లాకో మెడికల్ కాలేజీ సంకల్పం.. డాక్టర్ కావాలన్న విద్యార్థుల కలలను సాకారం చేసే మహాయజ్ఞం అని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 166 కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కళాశాలను మంజూరు చేశారని ఈ సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కకానున్నట్లు తెలిపారు. అలాగే 36 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాలను కూడా మంజూరు చేశారన్నారు. వేములవాడ తిప్పాపూర్ లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా చేసుకున్నామన్నారు. తెలంగాణ మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పడిన కొత్తలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో ఇంటెన్సీ కేర్ యూనిట్ కూడా లేదని తెలిపిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఐసీయులు, డయాలసిస్ సెంటర్ లు, 100 పడకల ఆసుపత్రుల నిర్మాణం చేశామన్నారు.

విద్య ,వైద్యంపై పేద ప్రజలు చేసే ఆర్థిక భారాన్ని తగ్గించగలిగామన్నారు. వైద్యంలో అధికంగా ఖర్చయ్యేది పరీక్షలు, మందులకేనని పేర్కొన్న మంత్రి ఆ ఆర్థిక భారాన్ని పేద ప్రజల పై తగ్గించేందుకు అధునాతన సౌకర్యాలతో తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ లను ఏర్పాటు చేశామన్నారు . బస్తీ ప్రజల సుస్తీ నీ పోగొట్టేందుకు బస్తి దవఖానాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22,309 మందికి కేసిఆర్ కిట్లను పంపిణీ చేశామన్నారు. తాజాగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. ఫలితంగానే నీతి అయోగ్ సూచీలో తెలంగాణ మూడవ స్థానంలో నిలిచింది అన్నారు. అనంతరం మంత్రి శ్రీ కేటీ రామారావు తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలోని 92 లక్షల 40 వేల రూపాయలతో నిర్మించిన వృద్ధాశ్రమం, వృద్ధుల డే కేర్ సెంటర్ ను ప్రారంభించారు.

అలాగే ఒక కోటి 35 లక్షలతో నిర్మించిన బాలికల చిల్డ్రన్ హోమ్ నూతన భవనంకు శంకుస్థాపన చేశారు. వృద్ధాశ్రమంలో నీ వంటగది, భోజన శాల, ఇతర గదులను పరిశీలించారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులతో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ వృద్ధాశ్రమం కు వచ్చే స్పందన బట్టి జిల్లాలోని మిగతా మండలాలలో వృద్ధాశ్రమం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులు తమ పిల్లలు తమను పట్టించుకోవడంలేదని బాధపడవద్దని ప్రభుత్వం వృద్ధులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలలో నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్,

రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఇంఛార్జి డీఆర్‌ఓ టి.శ్రీనివాస రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News