- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఫతేనగర్‌లో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులను పర్యవేక్షించినట్లు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. నిర్మాణంలో ఉన్న ఎస్టీపి(మురుగునీటి శుద్ధి కేంద్రం) పనుల పురోగతి, ఎస్టీపీల్లో వినియోగించే సాం కేతికతపై ఆరా తీశారు. ఎస్టీపి పనులు చేస్తున్న కార్మికులతో మాట్లాడారు. 1259 ఎంల్‌డీ కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీలు 2023 ఎండా కాలం నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ మారబోతోందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
- Advertisement -