Monday, November 18, 2024

రెజ్లర్లకు కెటిఆర్ మద్దతు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు తెలిపారు. రెజ్లర్లు ఒలింపిక్స్‌లో దేశానికి ఖ్యాతి తెచ్చిన సమయంలో సంబురాలు చేసుకున్నామని, న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్లకు అండగా నిలువాలని ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందేనన్న కెటిఆర్ హృదయపూర్వక మద్దతు ప్రకటిస్తున్నానన్నారు.

బిజెపి ఎంపీ. రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ సింగ్ తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఏడుగురు మహిళా రెజర్లు ఆరోపించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వివాదం ముదరడంతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఇప్పటి వరకు బయటకు రాకపోవడంతో వినేశ్ ఫోగాట్‌తో పాటు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ సహా 30 మంది రెజ్లర్లు జంతర్‌మంత్ వద్ద ఆందోళన చేపట్టారు. రెజ్లర్లకు పలువురు పార్టీల నేతలతోపాటు క్రీడాకారులు సైతం మద్దతు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News