Tuesday, April 8, 2025

చిన్నారి శ్రీవిద్య చదువుకు అండగా కెటిఆర్

- Advertisement -
- Advertisement -

చిన్నారి శ్రీవిద్య చదువుకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అండగా నిలిచారు. బాగా చదువుకోవాలని ఆశపడ్డ శ్రీవిద్యకు ఆధార్ రూపంలో ఎదురైన సమస్యపై కెటిఆర్ స్పందించారు. తన కార్యాలయ సిబ్బందిని శ్రీవిద్య ఇంటికి పంపించి తల్లిదండ్రులతో మాట్లాడించారు. ఆధార్, బర్త్ సర్టిఫికేట్ ఇప్పించడంలో సహాయం చేస్తామని అన్నారు. శ్రీవిద్య తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న కెటిఆర్, ఆమె చదువు ఆగిపోవద్దనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల స్కూల్ ఫీజును చెల్లించారు.

భవిష్యత్తులో శ్రీ విద్య చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని చెప్పారు. కెటిఆర్ చొరవతో సనత్‌నగర్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా జిహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి అవసరమైన సర్టిఫికెట్లు ఇప్పిస్తానని హామి ఇచ్చారు. తమ సమస్య గురించి తెలుసుకుని శ్రీవిద్య జీవితానికి కొత్త వెలుగు అందించిన కెటిఆర్‌కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రెండు సంవత్సరాల ఫీజు ముందే కట్టడంతో పాటు భవిష్యత్తులోనే శ్రీవిద్య చదువుకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానన్న కెటిఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News