- Advertisement -
హైదరాబాద్: గేయ రచయిత కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు. గతంలో ఆయన కుటుంబానికి అండగా ఉన్నామని, ఆయన కుమార్తె మాతృక ట్వీట్‌పై కెటిఆర్ స్పందించారు. కంది కొండ కుటుంబం ప్రస్తుతం కిరాయి ఇంట్లో ఉంటుందని, చిత్రపురి కాలనీలో నివాసం కల్పించాలని కెటిఆర్‌ను కందికొండ కూతురు విజ్ఞప్తి చేశారు. తమ సిబ్బంది మీతో మాట్లాడుతారని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అతి త్వరలో కలుస్తారని కెటిఆర్ రీట్వీట్ చేశారు.
- Advertisement -