Friday, November 22, 2024

ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యాఖ్యలకు కెటిఆర్ ఘాటు రిప్లై..

- Advertisement -
- Advertisement -

KTR taunts MLA Raja Singh over petrol price

హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఘాటు రిప్లై ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో వర్ష పరిస్థితులపై మంత్రి కెటిఆర్‌కు ఎంఎల్‌ఎ రాజాసింగ్ సవాల్ విసిరారు. తనతో పాటు మంత్రి కెటిఆర్ బైడ్ రైడింగ్‌కు రావాలని కోరారు. వర్షం పడుతున్న వేళ రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో లైవ్‌గా చూపిస్తానన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అసెంబ్లీలో మాటలకే పరిమితమని వాస్తవం మాత్రం చాలా ఘోరంగా ఉందని అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలకు తాజాగా కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కెటిఆర్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నం టుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు వాటి గురించి ప్రజల అభిప్రాయాలను అడగండి అంటూ కెటిఆర్ రాజాసింగ్‌కి సూచించారు, ‘పెట్రోల్ బంక్‌కు వెళ్లి అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఎలా పెరుగుతున్నాయో మీరు ఎందుకు తెలుసుకోకూడదు? అంతేకాదు.. సామాన్యుల ఇళ్లకు వెళ్లి..ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఎలా పెరుగుతుందో కూడా అడగొచ్చు. దేశంలో జిడిపి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంచడమని అర్థమా..? అంటూ కెటిఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్న నేపథ్యంలో.. ముందు ఆ విష యాలను తెలుసుకోండంటూ గట్టిగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News