మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం బుధవారం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళింది. ఆ దేశ రాజధాని పారిస్‌లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రతినిధి బృందం పాల్గొనునంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సమీకరణ లక్ష్యంతో కెటిఆర్ ఈ పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 28, 29 తేదీల్లో సెనేట్లో జరిగే సమావేశంలో మంత్రి కెటిఆర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 29వ తేదీన ఫ్రెంచ్ సెనేట్లో యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రసంగించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం మంత్రి కెటిఆర్‌ను కొద్ది రోజుల క్రితం ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.
వారి ఆహ్వానం మేరకు యాంబిషన్ ఇండియాలో మంత్రి కెటిఆర్ పాల్గొని కీలకోపన్యాసం చేయనున్నారు. రెండు దేశాల వ్యాపార, వాణిజ్య భాగస్వామ్యులు, కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. ’గ్రోత్ డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో…ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్కొవిడ్ ఎరా’ అనే అంశంపై కెటిఆర్ తన అభిప్రాయాలను సమావేశంలో పంచుకోనున్నారు. ఆరోగ్య రక్షణ, వాతావరణ మార్పులు, డిజిటల్ ట్రాన్సర్మేషన్ ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తోంది. కాగా ఈ పర్యటనలో భాగంగా పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సిఇఒలతో కూడా మంత్రి కెటిఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడుకులను అనుకూలమైన పరిస్థితిలను ఆ దేశ పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పట్టే వారికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఇస్తున్న ప్రొత్సాహకాలను సైతం సమగ్రంగా తెలియజేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించే సదరు కంపెనీల అధినేతల నుంచి కెటిఆర్ స్పష్టమైన హామీని కూడా తీసుకున్నారు. కాగా కెటిఆర్‌తో పాటు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఫ్రాన్స్‌కు వెళ్లిన రాష్ట్ర బృందంలో ఉన్నారు.