Wednesday, January 22, 2025

కర్ణాటక ప్రజలకు మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు

- Advertisement -
- Advertisement -

నీచమైన, విద్వేషపూరిత రాజకీయాలను
తిరస్కరించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు
కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు
ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నీచమైన, విద్వేషపూరిత రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటక ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో మంత్రి కెటిఆర్ శనివారం ట్వీట్ చేశారు.

కేరళ స్టోరీ చిత్రం కర్ణాటక ప్రజలను ఆకర్షించడంలో విఫలం అయ్యిందని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవని మంత్రి కెటిఆర్ అన్నారు.పెట్టుబడులు ఆకర్షించడంలో.. మౌళికసదుపాయాల్ని క్రియేట్ చేయడంలో.. దేశ భవిష్యత్తు కోసం.. హైదరాబాద్, బెంగుళూరు నగరాలు ఆరోగ్యకరంగా పోటీపడాలని మంత్రి కెటిఆర్ తన ట్వీట్‌లో ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News