Thursday, January 16, 2025

నేడు ఈడీ విచారణకు కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గురువారం ఉదయం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఫార్ములా ఈ రేసు కేసులో విచారణను ఎదుర్కొనేందుకు కెటిఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఫార్ములా-ఈ కేసులో ఇప్పటికే అరవింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసును కొట్టివేయాలని కెటిఆర్ క్వాష్ పిటిషన్ వేయగా హైకోర్టు తిరస్కరించింది. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లినా ఆయన ఊరట లభించలేదు. సుప్రీం కోర్టు కూడా ఆయన పిటిషన్ డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఈడీ విచారణకు కెటిఆర్ హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News