హైదరాబాద్: వనస్థలిపురంలో శాటిలైట్ బస్ టెర్మినల్ కు రేపు మంత్రి కెటిఆర్ భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు భూమిపూజలో కెటిఆర్ పాల్గొనున్నారు. వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో బస్ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. అంతర్ జిల్లాల బస్సుల కోసం శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణం కోసం తొలిదశలలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. నల్గొండ, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం వెళ్లే బస్సుల కోసం ఈ టెర్మినల్ అందుబాటులో ఉండనుంది. తొలిదశలో 3 బస్ బేలు నిర్మించున్నట్టు హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. ప్రతి బస్ బేలో ఎసితో కూడిన వేచిఉండే గదులు, ఫార్మసీ, బ్యాంకు ఎటిఎం, నీటి ఎటిఎం, విచారణ కేంద్రం, పుడ్ కోర్టులు, మరుగుదొడ్లు, పార్కింగ్ ఏరియా లోకల్ బస్టాప్ లు ఏర్పాటు చేయనున్నారు. బైక్, కార్లు, ట్రక్కులకు పార్కింగ్ సౌకర్యంతో కూడా కల్పించనున్నారు. రోజుకు 8,500 మంది రాకపోకలకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్న శాటిలైట్ బస్ టెర్మినల్ ప్రాజెక్టు ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని హెచ్ఎండిఏ లక్ష్యంగా పెట్టుకుంది.
KTR to lay foundation stone for satellite bus terminal