Wednesday, January 8, 2025

నేడు మహబూబ్‌నగర్‌లో మంత్రి కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం పర్యటించనున్నారు.
ఉదయం 9 గంటలకు బూత్పూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ముఖద్వారం, పార్కులను ప్రారంభిస్తారు. 9.30 గంటలకు మూసాపేట మండలం వేములలో కోజెంట్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. అనంతరం మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 11 గంటలకు మెట్టుగడ్డ ప్రభుత్వ ఐటీఐ బాలికల క్యాంపలో రూరల్ మైక్రో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, సెయింట్ కంపెనీ అధినేత బివిఆర్ మెహన్‌రెడ్డితో కలిసి శంకుస్ధాపన చేస్తారు.

ఆ తర్వాత పద్మావతి కాలనీ అయ్యప్ప గుట్ట సమీపంలో నిర్మించిన ఆధునిక వైకుంఠ ధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని, తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారం బించి లబ్దిదారులకు అందజేస్తారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ సీతారామారావు, సెయింట్ ఫౌండేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇంచార్జి కృష్ణ దివి, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కమిషనర్ ప్రదీప్‌కుమార్, డిఎస్పీ మహేశ్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News