Monday, March 17, 2025

ఈ నెల 20 నుంచి అన్ని జిల్లాలలో కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా, జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అందులో భాగంగా వరంగల్‌లో లక్షలాదిమంది పాల్గొన్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనునట్లు పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కెటిఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News