Saturday, November 16, 2024

వెయ్యి కోట్లతో వస్తున్న ఫిష్ ఇన్

- Advertisement -
- Advertisement -

5వేల మందికి ఉద్యోగాలు దాణా తయారీ, కేజ్
కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్, ఎగుమతులు మున్నగు అనేక విభాగాలు
తిలాపియా చేపల ఎగుమతిలో పేరుగాంచిన ఫిష్ ఇన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టం

KTR tour in America

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. పె ట్టుబడులే లక్షంగా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ దిశగా దూసుకపోతున్నా అనేక సంస్థలతో సమావేశాలను నిర్వహించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకరావడంలో కృతకృతులవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక సంస్థలు రాష్ట్రంలో తమ వ్యాపారాలను విస్తరించడానికి ముం దుకుగా తాజాగా గురువారం మరోసారి కంపెనీకి ముందుకు వచ్చింది. రాష్ట్రంలో రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఫిష్ ఇన్ అనే కంపెనీ తన అంగీకారాన్ని తెలియజేసింది.ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే కంపెనీగా ఫిష్ ఇన్‌కు మంచి పేరుంది.

అమెరికాలో మంత్రి కెటిఆర్‌తో జరిగిన సమావేశంలో కంపెనీకి చెందిన చైర్మన్, సిఇఒ మనీష్ కు మార్ ఈ మేరకు కంపెనీ నిర్ణయాన్ని తెలిపారు. తమ సంస్థ సుమారు 5 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయ ని తెలియజేసింది. వెయ్యి కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టంను డెవలప్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఈ మేరకు కంపెనీ తన కార్యకలాపాలను ప్రపంచ స్థా యి ప్రమాణాలతో ప్రారంభించేందుకు స ముఖతను వ్యక్తం చేశారు. ఫిష్‌ఇన్ కంపెనీ చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయా రీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్‌తో పాటు ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని కంపెనీ సిఇఒ మనీష్ కుమార్ తెలిపారు.

కంపెనీ పూర్తిస్థా యి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 85 వేల మెట్రిక్ టన్నుల చేపలను ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి ఎగుమతి చే సే అవకాశం  ఉంటుందన్నారు. భారీ పెట్టుబడిని తెలంగాణలో పెట్టనున్న ఫిష్‌ఇన్ కంపెనీకి ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో మత్స్య పరిశ్రమకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం అందివస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు ఐదువేల మందికి ఉపాధి అవకాశాలు లభించడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువతకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమపై ఆధారపడిన వారికి, మిడ్ మానేరు నిర్వాసితులకు ఉపాధి కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీ యజమాన్యానికి మంత్రి కెటిఆర్ సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News